logo

బీమా సొమ్ము వడ్డీతో చెల్లించాలని తీర్పు

బీమా సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ శుక్రవారం తీర్పు చెప్పింది.

Published : 25 Mar 2023 04:14 IST

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: బీమా సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ శుక్రవారం తీర్పు చెప్పింది. కమిషన్‌ కార్యాలయ ఉద్యోగులు చెప్పిన సమాచారం మేరకు గుడివాడకు చెందిన పిచ్చిరెడ్డి విజయవాడ రెలిగేర్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌  కార్యాలయం ద్వారా తన కుమార్తె కామక్షిని నామినిగా పెట్టి రూ.50లక్షల ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. తరువాత కొన్నాళ్లకు ఆయన చనిపోవడంతో కామాక్షి బీమా సొమ్ముకోసం సంస్థను ఆశ్రయించగా వారు తిరస్కరించడంతో 2020 ఆగస్టు 31న వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన కమిషన్‌ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్‌, సభ్యులు  శ్రీలక్ష్మీ రాయల, నందిపాటి పద్మారెడ్డిలు  బీమా సొమ్మును 9శాతం వడ్డీతో, మానసిక వేదన కలిగించినందుకు రూ.50వేలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.10వేలు కలిపి మొత్తాన్ని 30 రోజుల్లోపు ఫిర్యాదుదారుకు చెల్లించాలని బీమా సంస్థను ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని