logo

ధాన్యం కొనుగోలు కేంద్రాలు 31 వరకే

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల 31 వరకే కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 25 Mar 2023 04:14 IST

ఎలా నూర్చాలి? ఎప్పుడు విక్రయించాలంటున్న రైతులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల 31 వరకే కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. దివిసీమ ప్రాంతంలో ఏటా నెల రోజులు ఆలస్యంగా నాట్లు వేస్తారు. వరి కోసిన తర్వాత మినుము విత్తనాలు జల్లడం వలన మినుము నూర్పిళ్లు పూర్తయ్యే వరకు పొలాల్లోకి ట్రాక్టర్లు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఇటీవల మినుము నూర్పిళ్లు పూర్తి కాగా, వరి నూర్పిడులు పూర్తికాని రైతులు ఇంకా ఉన్నారు. ఈ నెల 15 నుంచి తుపాను హెచ్చరికలు జారీ కావడంతో నూర్పిడికి అవకాశం లేకుండా పోయిందని, గురువారం కూడా కొన్ని గ్రామాల్లో వర్ష పడిందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి కుప్పలు ఎలా నూర్చాలని? ఈ నెల 31లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎలా సరఫరా చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీసం మరో 15 రోజులపాటు ఈ కేంద్రాలను కొనసాగించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని