logo

‘ఆరోగ్యశ్రీ సేవలకు రుసుం వసూలు చేస్తే చర్యలు’

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ద్వారా వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని, రోగుల నుంచి అక్రమంగా రుసుం వసూలు చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు హెచ్చరించారు.

Published : 26 Mar 2023 04:44 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ద్వారా వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని, రోగుల నుంచి అక్రమంగా రుసుం వసూలు చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా క్రమ శిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోందని, పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుం వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆసుపత్రులపై పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి, నివేదికలు అందజేయాలని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తను ఆదేశించారు. తిరువూరు అమరావతి ఆసుపత్రి, విజయవాడలోని స్మైల్‌, వంశీ హార్ట్‌ కేర్‌ ఆసుపత్రుల్లో కొంత మొత్తాన్ని వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని