logo

‘పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు’

కుల, మత, పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 04:53 IST

లబ్ధిదారులకు నమూనా చెక్కు అందజేస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్రంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది, కలెక్టర్‌ డిల్లీరావు తదితరులు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కుల, మత, పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యులకు మూడో విడత నిధుల జమ జిల్లా కార్యక్రమాన్ని విజయవాడలోని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయ సంఘాల మహిళలకు నమూనా చెక్కు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. నాటి పాద యాత్రలో జగన్‌ మహిళల ఇబ్బందులను గమనించి, నేడు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ.. జిల్లాలో 3,21,170 మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.276.79 కోట్లను జమ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, ఉప మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆడపా శేషు, టి.శ్రీకాంత్‌, ఎం.శివరామకృష్ణ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ప్రక్షాళనకే సస్పెన్షన్లు : వెలంపల్లి

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పార్టీ ప్రక్షాళన కోసమే నలుగురు వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడానికి కారణమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లో శనివారం ఆసరా పథక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను నియమించిన విషయాన్ని గమనించాలన్నారు. తెదేపాకు దొంగచాటుగా ఓటు వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గడప గడపకు కార్యక్రమాల నిర్వహణ ద్వారా తాము ప్రజలకు మరింత చేరువ అయ్యామని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు