logo

‘మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ’

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, మోదీ పాలనలో రాజ్యంగ వ్యవస్థలను తుంగలో తొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.

Published : 26 Mar 2023 04:53 IST

నిరసన తెలుపుతున్న రుద్రరాజు, నరసింహారావు, తాంతియాకుమారి, గురునాథం, శివాజీ తదితరులు

విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్‌), న్యూస్‌టుడే : దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, మోదీ పాలనలో రాజ్యంగ వ్యవస్థలను తుంగలో తొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో శనివారం పైపులరోడ్డు కూడలిలో ధర్నా చేశారు. నల్ల కండువాలు ధరించి, నల్ల జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళన చేశారు. రుద్రరాజు మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, ఇన్‌కంటాక్స్‌ అథారిటీలను తమ చేతుల్లోకి తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటిల రాజకీయాలతో రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. అన్యాయాలు, అక్రమాలను పశ్నిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కంఠక పాలనపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని వెల్లడించారు. అదానీ, అంబానీలు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుని, అక్రమ ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కాంట్రాక్ట్‌లు ఆ సంస్థలకే కట్టబెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ వి.గురునాథం, నాయకులు తాంతియాకుమారి, కొలనుకొండ శివాజీ, పి.వై.కిరణ్‌, మేడా సురేష్‌, పీటర్‌ జోసఫ్‌, వేముల శ్రీను, రాణిమేకల సతీష్‌, జేసుదాసు పోతరాజు, మీసాల రాజేశ్వరరావు, ఖాజా మోహిద్దీన్‌ పాల్గొన్నారు.

నేడు సత్యాగ్రహం: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఈ నెల 26వ తేదీ ఉదయం విజయవాడ వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్‌, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట సత్యాగ్రహం చేయనున్నట్లు రుద్రరాజు వెల్లడించారు. ప్రజాస్వామ్య వాదులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు