logo

పేద యువకుడికి పెద్ద కష్టం!

ఓ రోడ్డు ప్రమాదం.. నిరుపేద యువకుడికి పెద్ద కష్టాన్నే తెచ్చి పెట్టింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో రూ.లక్షలు వెచ్చించి తండ్రి శస్త్రచికిత్స చేయించారు.

Published : 26 Mar 2023 04:53 IST

శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేయాలని వేడుకోలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షేక్‌ బాబూసాహెబ్‌ (పాతచిత్రం)

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ రోడ్డు ప్రమాదం.. నిరుపేద యువకుడికి పెద్ద కష్టాన్నే తెచ్చి పెట్టింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో రూ.లక్షలు వెచ్చించి తండ్రి శస్త్రచికిత్స చేయించారు. ఈ ఘటనలో నరాలు దెబ్బతిని ఎడమ కన్ను కోల్పోయాడు. ప్రస్తుతం కుడి కంటికి మరో ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆర్థిక స్థోమత లేక దాతల సాయానికి ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన షేక్‌ బాబూసాహెబ్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ ఏడాది జనవరి 28న బైకుపై నందిగామ నుంచి గోళ్లమూడి వెళుతుండగా పల్లగిరి వద్ద రహదారి మలుపులో కుక్క అడ్డు రావడంతో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి తలకు ఆపరేషన్‌ చేయించారు. టైలరింగ్‌ వృత్తిపై ఆధారపడ్డ అతని తండ్రి జాన్‌సైదా రూ.3 లక్షలు అప్పు చేసి శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం కుడి కంటి రెప్ప కింద ఎముక దెబ్బతినడంతో మరో శస్త్రచికిత్స చేయించాలని విజయవాడ ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఇందుకు రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని వారు తెలిపారు. ఇప్పటికే రూ.3 లక్షలు అప్పు చేశామని, ఈ పరిస్థితుల్లో మరో రూ.1.50 లక్షలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించాలంటే తమకు తలకు మించిన భారమేనని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక చేయూతనివ్వాలని యువకుడి తండ్రి జాన్‌సైదా వేడుకుంటున్నారు. దాతలెవరైనా సాయం చేయడానికి ‘ఈనాడు’ ప్రతినిధిని ఫోన్‌ నంబరు 80085 51763లో సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని