logo

పట్టాభి స్మారక కట్టడానికి ఐక్య ఉద్యమం

పట్టాభి స్మారక కట్టడానికి ఐక్యంగా ఉద్యమిద్దాం అంటూ అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఓ వేడుక మందిరంలో వివిధ పక్షాల నాయకులు సమావేశం నిర్వహించారు.

Published : 26 Mar 2023 05:04 IST

కరపత్రాలు ఆవిష్కరణలో పాల్గొన్న వివిధ పక్షాల నాయకులు బండి రామకృష్ణ, బాబాప్రసాదు తదితరులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: పట్టాభి స్మారక కట్టడానికి ఐక్యంగా ఉద్యమిద్దాం అంటూ అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఓ వేడుక మందిరంలో వివిధ పక్షాల నాయకులు సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ మహనీయుడు భోగరాజుపట్టాభి సీతారామయ్య పేరిట నిర్మించే భవనంపై రాజకీయాలు చేయడం తగదన్నారు. బ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడంతో ఆ అధికారులు రూ.40 కోట్లు కేటాయిస్తే వినియోగించుకోలేక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే రెండెకరాల స్థలం కేటాయించినా కౌన్సిల్‌ ఆమోదించడం లేదని, స్వాతంత్య్ర సమరయోధునికి ఇచ్చే గౌరవం ఇదేనా?అంటూ ప్రశ్నించారు. భవన నిర్మాణంపై పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వాటిని పంపిణీ చేయడంతోపాటు సంతకాల సేకరణచేసి వాటిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపించాలని,  పోరాటాలు చేయడానికి పట్టాభి సీతారామయ్యస్మారక భవన నిర్మాణ సమితి పేరిట సంస్థను రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించారు. విశ్రాంత ప్రిన్సిపల్‌ ఏఆర్‌కే మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెదేపా నుంచి మోటమర్రి బాబాప్రసాదు, గొర్రెపాటి గోపీచంద్‌, పుప్పాల ప్రసాదు, జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, భాజపా నాయకులు పంతం గజేంద్ర, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నాగలింగం రాము, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కొడమంచిలి చంద్రశేఖర్‌, వామపక్ష నాయకులు లింగం ఫిలిప్‌, బూర సుబ్రహ్మణ్యం, తెదేపా లీగల్‌సెల్‌ నాయకులు ఎండీ సులేమాన్‌, పుప్పాల ప్రసాదు, బ్రాహ్మణ సంఘ నాయకులు వేమూరి రామకృష్ణారావు, పీవీ ఫణికుమార్‌, మోపర్తి సుబ్రహ్మణ్యం, వింజమూరి శివరామ్‌, సింగరాజు గోవర్ధన్‌, వీఎస్‌ఎస్‌ఆర్‌కే శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని