logo

హక్కుల సాధనకు పోరాటం చేయాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు విద్య పరంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్‌ కరీముల్లాఖాన్‌ పిలుపునిచ్చారు.

Published : 26 Mar 2023 05:04 IST

మార్ఫింగ్‌ చేసినట్లు ధ్రువపత్రం చూపుతున్న నాయకులు

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు విద్య పరంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్‌ కరీముల్లాఖాన్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కరీముల్లాఖాన్‌ మాట్లాడుతూ దేశంలో ముస్లిం జనగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ముస్లిం మైనారిటీ పాఠశాలలో ముస్లిం అధ్యాపకురాలిపై జరిగిన అసభ్యకరమైన ప్రచారం ఖండించారు. ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు షేక్‌ మౌలాలి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కుల సాధనకు పోరాడాలన్నారు. రాష్ట్ర మహిళా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తిలకచూరి రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మహిళా నాయకురాలు షాహినా, కృష్ణా జిల్లా ఎస్టీ సంఘం అధ్యక్షురాలు కె.ఆదిలక్ష్మిలు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని