logo

ఆపన్నులను ఆదుకోవడమే లక్ష్యం

ఆపన్నులను ఆదుకోవడమే లక్ష్యంగా సామాజిక సేవలు చేస్తున్నామని చలసాని నాగమణి ఫౌండేషన్‌ (అమ్మాజీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌) వ్యవస్థాపకుడు చలసాని అరుణ్‌ప్రసాద్‌ అన్నారు.

Published : 26 Mar 2023 05:04 IST

బాధిత కుటుంబ సభ్యునికి ఆర్థిక సాయం అందజేస్తున్న ట్రస్టు అధ్యక్షుడు, స్థానిక ప్రతినిధులు

నెప్పల్లి (కంకిపాడు), న్యూస్‌టుడే: ఆపన్నులను ఆదుకోవడమే లక్ష్యంగా సామాజిక సేవలు చేస్తున్నామని చలసాని నాగమణి ఫౌండేషన్‌ (అమ్మాజీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌) వ్యవస్థాపకుడు చలసాని అరుణ్‌ప్రసాద్‌ అన్నారు. ఇటీవల నెప్పల్లిలో జరిగిన అగ్నిప్రమాద బాధితులు గొర్ల శివభవాని కుటుంబానికి శనివారం రూ.15 వేల ఆర్థిక సాయం చేశారు. ఈడుపుగంటి కిరణ్‌ తదితర పేద విద్యార్థులకు రుసుముల నిమిత్తం రూ.30 వేలు అందజేశారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెలల పాటు రోజుకు 150 నుంచి 200 మందికి అన్నదానం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నెప్పల్లి పరిసర గ్రామాల్లోని పేదలను ఆదుకోవడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ‘తానా’ సభ్యులు కానూరు శ్రీహేమ, వెలంపల్లి సందీప్‌, తెదేపా సీనియర్‌ నాయకులు నల్లూరి కిరణ్‌, వల్లభనేని శివ, ట్రస్ట్‌ సభ్యులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కొండవీటి రత్నబాబు, గ్రామ తెదేపా అధ్యక్షుడు కొలుసు గోవిందరాజు, దేవినేని శివయ్య, రాజు, లక్ష్మణ్‌, ఎ.నాని, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు