logo

‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం తప్పదు’

వికృత రాజకీయాలతో అవినీతే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైకాపా పతనం అంచుకు చేరిన విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల స్పష్టం చేశాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 26 Mar 2023 05:04 IST

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న రవీంద్ర, నారాయణరావు, తదితరులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: వికృత రాజకీయాలతో అవినీతే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైకాపా పతనం అంచుకు చేరిన విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల స్పష్టం చేశాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపును పురస్కరించుకుని శనివారం పార్టీ కార్యాలయం పార్టీ బీసీ సెల్‌ ఆధ్వర్యాన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రవీంద్ర మాట్లాడుతూ అనురాధను ఓడించేందుకు వైకాపా చేసిన కుట్ర రాజకీయాలు, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టింగ్‌లను బట్టి ఆ పార్టీకి బీసీలపై ఏపాటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చివరకు సొంత పార్టీ వారే ఛీకొట్టే పరిస్థితి కొనితెచ్చుకున్న జగన్‌ భవిష్యత్తు ఇక శూన్యమేనన్నారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన అనురాధ విషయంలో వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరు హేయమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైకాపాకు తగురీతిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు గొర్రెపాటి గోపిచంద్‌, బాబాప్రసాద్‌, ఇలియాస్‌పాషా, లంకె నారాయణప్రసాద్‌, లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మజ, వసంతకుమారి, పార్టీ కార్పొరేటర్లు, బీసీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని