రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులకు స్పష్టం చేశారు.
గాలికుంటు వ్యాధి నివారణ టీకాపై గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్, జేసీ, తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీతో సమావేశం నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రస్తావిస్తూ అందుకు కారణాలు విశ్లేషించాలన్నారు. పోలీస్, రవాణా శాఖల పరంగా విధిగా డ్రంక్ అండ్ డ్రెవ్‌పై దృష్టి సారించాలన్నారు. అప్రోచ్ రహదారులకు వేగనిరోధకాలతో పాటు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పెనమలూరు హైవే వద్ద రద్దీ సమయాల్లో ఇసుక లారీలు అనుమతించకుండా వాటికి ప్రత్యేక సమయాలు కేటాయించాలని ఆదేశించారు. జిల్లా రవాణా అధికారి సీతాపతిరావు గడచిన నెలలో 65 రహదారి ప్రమాదాలు సంభవించాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 83 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశామని, అతివేగం, ఓవర్ లోడింగ్‌లపై 1,966 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ డివిజన్లకు రెండు స్పీడ్‌గన్‌లు, 6 బ్రీత్ ఎనలైజర్‌లు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. డీఎస్పీ రమేష్‌బాబు, డీఎంహెచ్‌వో గీతాబాయి, బందరు డిపో మేనేజర్ పెద్దిరాజు, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
30 నాటికి పంట నష్టం అంచనాలు
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టం అంచనాలను ఈనెల 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ అపరాజితసింగ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా 6,850 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాల ద్వారా తెలిసిందన్నారు. పూర్తి నష్టం తెలుసుకునేందుకు నియమించిన బృందాలు నెలాఖరు నాటికి నివేదిక ఇస్తే ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సలహా మండలి ఛైర్మన్ జన్ను రాఘవరావు మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆవిష్కరించారు.
అసౌకర్యాలు లేకుండా చూడాలి
రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో వారి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మసీదును సంబంధిత అధికారులు సందర్శించి పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలపై ఆరా తీయాలని సూచించారు. ఎమ్మెల్సీ మహ్మద్‌రుహుల్లా మాట్లాడారు. డీఎస్పీ మాసుంబాషా మాట్లాడుతూ మసీదుల వద్ద తగు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ సిలార్‌దాదా, జామియా మసీదు అధ్యక్షులు, పలువురు ముస్లిం పెద్దలు కొన్ని సమస్యలు తెలియచేసి, కలెక్టర్, ఎమ్మెల్సీని సత్కరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమాధికారిణి షంషున్నీసా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని