logo

జాతీయ పోటీలకు ‘స్మార్ట్‌ ఏటీఎం’ ఎంపిక

ఘంటసాల జడ్పీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.తేజ విఠల్‌కుమార్‌ తయారు చేసి ఇటీవల ఆన్‌లైన్‌లో ఇన్‌స్ఫైర్‌ మనక్‌ పోటీల్లో ప్రదర్శించిన ‘స్మార్ట్‌ ఏటీఎం మిషన్‌’ నమూనా జాతీయ స్థాయి...

Published : 26 Mar 2023 05:12 IST

ప్రదర్శనలో విద్యార్థి తేజ విఠల్‌కుమార్‌, ఉపాధ్యాయుడు విజయకుమార్‌

ఘంటసాల, న్యూస్‌టుడే: ఘంటసాల జడ్పీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.తేజ విఠల్‌కుమార్‌ తయారు చేసి ఇటీవల ఆన్‌లైన్‌లో ఇన్‌స్ఫైర్‌ మనక్‌ పోటీల్లో ప్రదర్శించిన ‘స్మార్ట్‌ ఏటీఎం మిషన్‌’ నమూనా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయిని ఎం.శ్రీరంగవల్లి శనివారం తెలిపారు. ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు ఎ.విజయకుమార్‌ పర్యవేక్షణలో విద్యార్థి తేజ విఠల్‌కుమార్‌ రూపొందించిన ప్రాజెక్టు దిల్లీలో త్వరలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. విద్యార్థి అభివృద్ధి చేసిన స్మార్ట్‌ ఏటీఎం యంత్రం ద్వారా నగదు ఉందో లేదో సిగ్నల్‌ ఇస్తుందన్నారు. దీని ద్వారా ఖాతాదారుడు ఏటీఎం కేంద్రం లోపలకు వెళ్లకుండా వెనక్కి వచ్చేయవచ్చన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థి తేజ విఠల్‌కుమార్‌ను ప్రధానోపాధ్యాయిని శ్రీరంగవల్లి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని