మెరక ముసుగులో మట్టి దందా
అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. లేఔట్ల మెరక ముసుగులో యథేచ్ఛగా మట్టి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామదేవత విగ్రహం తొలగింపుతో వెలుగు చూసిన అక్రమం
చెరువు మధ్యలో గంగానమ్మ అమ్మవారు (వృత్తంలో)
అడ్డాడ(పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. లేఔట్ల మెరక ముసుగులో యథేచ్ఛగా మట్టి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చెరువులో తవ్వకాలు చేస్తుండగా అడ్డుగా ఉందనే ఉద్దేశంతో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న గంగానమ్మ అమ్మవారి విగ్రహం తొలగింపు పామర్రు మండలం అడ్డాడలో వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అడ్డాడ పంచాయతీలో సుమారు 260 గృహాల్లో 1,040 మంది జనాభా నివసిస్తున్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఈ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 92 సెంట్లలో 42 మందికి, బీసీ కాలనీలో 63 సెంట్లలో 30 మందికి ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది. ఆ లేఔట్లు మెరక చేయించాలని లబ్ధిదారులు కోరడంతో స్థానికంగా ఉన్న 4 ఎకరాల ఊర చెరువుని ఎండగట్టారు. గత నెలలో ఉపాధి కూలీలతో చెరువు గట్లు పటిష్టపర్చే పనులు పూర్తిచేశారు. అనంతరం చెరువులో పూడిక తీయగా వచ్చిన మట్టితో జగనన్న లేఔట్లు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను మెరక చేయించాలని అధికార పార్టీ మద్దతుతో గెలిచిన పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా 20 రోజుల క్రితం పొక్లెయిన్‌తో చెరువు తవ్వకం ప్రారంభించగా ఇంతవరకకూ 2,500పైగా ట్రక్కుల మట్టి తవ్వినట్లు తెలుస్తోంది.
ట్రక్కు మట్టి రూ.500..
జగనన్న ఇళ్ల స్థలాల మెరక, ప్రభుత్వ కార్యాలయాల స్థలాల బరంతు సాకుతో ఎథేచ్ఛగా మట్టిని విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ముసుగులో ఇంతవరకూ స్థానిక సచివాలయం, ఎస్సీ, బీసీ కాలనీల్లోని లేఔట్లకు దాదాపు 60 ట్రిప్పుల మట్టి తోలగా, మిగిలిన మట్టి ఒక్కో ట్రక్కు మట్టి రూ.500 చొప్పున అనధికారికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
అమ్మవారికి అపచారం
అక్రమార్కులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా యథేచ్ఛగా మట్టి తవ్వేస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. శుక్రవారం మట్టి తవ్వకాలకు సిద్ధమవగా ట్రాక్టర్లు దిగిపోతుండడంతో ఆ ప్రక్రియ నిలిపివేశారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం తాగి చెరువు మధ్యలో ఉన్న గంగానమ్మ అమ్మవారి విగ్రహాన్ని తొలగించి రోడ్డుపైకి తెచ్చి వదిలేశారు. దీనిపై స్థానికులు మండి పడటంతో రాత్రి సమయంలో తిరిగి విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని