TANA సౌజన్యంతో చందర్లపాడులో ఉచిత కంటివైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), రోటరీ హాస్పిటల్‌- ఉయ్యూరు వారి సౌజన్యంతో ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఉచిత మెగా కంటివైద్య శిబిరం నిర్వహించారు.

Published : 26 Mar 2023 22:28 IST

ఎన్టీఆర్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), రోటరీ హాస్పిటల్‌- ఉయ్యూరు వారి సౌజన్యంతో ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఉచిత మెగా కంటివైద్య శిబిరం నిర్వహించారు. శీలంనేని మౌళేశ్వరరావు, సులోచన దేవి దంపతుల జ్ఞాపకార్థం గోపాలకృష్ణ, సుధాకర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక తెదేపా నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  ప్రారంభించారు. చందర్లపాడుతోపాటు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ల అద్దాలు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు