logo

అవార్డు అందుకోవడం ఎంతో ఆనందం

‘విజయవాడ నగరం కళలకు ప్రసిద్ధి.. నేను ఇక్కడే పుట్టాను. నేను పుట్టిన గడ్డపై జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉంది.

Published : 27 Mar 2023 04:47 IST

మాట్లాడుతున్న రాఘవేంద్రరావు

పటమట, న్యూస్‌టుడే: ‘విజయవాడ నగరం కళలకు ప్రసిద్ధి.. నేను ఇక్కడే పుట్టాను. నేను పుట్టిన గడ్డపై జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత సంతోషం ఉంది.’ అని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ పటమటలోని వేదిక కళ్యాణ మండపంలో కె.రాఘవేంద్రరావుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్‌కు ఎంతో ఘన చరిత్ర ఉందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాంటి సంస్థ నుంచి ఈ అవార్డు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన అన్నారు. ఆస్కార్‌ సాధించి  ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ వైపు చూసేలా చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం కృషికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ సినిమాలకు దర్శకత్వం వహించడం లేదన్నారు. కె.ఆర్‌.ఆర్‌ అనే య్యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభిచానని, దాని ద్వారా కొత్త దర్శకులు, నటీనటులను పోత్సహిస్తున్నామన్నారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి సీతారామిరెడ్డి, కోశాధికారి తిలక్‌, పిడిజిలు పట్టాభిరామయ్య, ఎంసి దాస్‌, మోహన్‌ ప్రసాద్‌ సభ్యులు కాంతి లాల్‌ జైన్‌, శ్రీదేవి, రామచంద్రరావు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని