logo

సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కృషి రత్న, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.ఖాదర్‌వలి అన్నారు.

Published : 27 Mar 2023 04:47 IST

హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తున్న పద్మశ్రీ ఖాదర్‌వలి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : సిరి ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కృషి రత్న, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.ఖాదర్‌వలి అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టు ఆవరణలో ఆదివారం దేశీయ ఆహారంతో ఆధునిక రోగాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ఖాదర్‌వలి మాట్లాడుతూ.. సిరి ధాన్యాలైన కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వీటిని తీసుకుంటే ఆధునిక రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని సూచించారు. శారీరక శ్రమతో పాటు ఆహారపు అలవాట్లు క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని తెలిపారు. సిరిధాన్యాలను అధికంగా సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలని రైతు నేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధి పరదేశి, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని