logo

టెన్నిస్‌ విజేతలు క్రిష్‌, పరిణిత

స్టార్‌ టెన్నిస్‌ అకాడమీ, గ్లోబల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిడమానూరులో జరిగిన రాష్ట్ర ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో అండర్‌-12 బాలబాలికల విభాగాల్లో వై.క్రిష్‌ (విజయవాడ), పరిణిత కుట్టి (విశాఖ) విజేతలుగా నిలిచారు.

Published : 27 Mar 2023 04:47 IST

క్రీడాకారులతో రంగారావు, గోపాల్‌, ప్రసాద్‌ తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్టార్‌ టెన్నిస్‌ అకాడమీ, గ్లోబల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిడమానూరులో జరిగిన రాష్ట్ర ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో అండర్‌-12 బాలబాలికల విభాగాల్లో వై.క్రిష్‌ (విజయవాడ), పరిణిత కుట్టి (విశాఖ) విజేతలుగా నిలిచారు. బాలుర ఫైనల్‌లో వై.క్రిష్‌ 6-3 స్కోర్‌ తేడాతో అఖిల్‌ (విశాఖ)పై విజయం సాధించగా.. బాలికల ఫైనల్‌లో పరిణిత కుట్టి (విశాఖ) 6-0 తేడాతో కె.హారిక (విశాఖ)పై గెలిచారు. అండర్‌-14 బాలుర ఫైనల్‌లో డి.అఖిల్‌ (విశాఖ) 6-1 తేడాతో జీషన్‌ ఖాన్‌ (విజయవాడ)పై విజయం సాధించగా.. బాలికల ఫైనల్‌లో పరిణిత కుట్టి 6-1 తేడాతో ఇషితా పట్నాయక్‌ (విశాఖ)పై గెలుపొందారు. అండర్‌-16 బాలుర ఫైనల్‌లో టి.వెంకట కృష్ణ చైతన్య (విజయవాడ) 6-3 తేడాతో హుసేన్‌ అగర్వాల్‌ (విజయవాడ)పై నెగ్గగా.. బాలికల ఫైనల్‌లో పి.రూపాదేవి (విజయవాడ) 6-3 తేడాతో ఇషితా పట్నాయక్‌ (విశాఖ)పై విజయం సాధించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో నిడమానూరు గ్రామ సర్పంచి శీలం రంగారావు విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి స్టార్‌ టెన్నిస్‌ అకాడమీ డైరెక్టర్‌ కె.గోపాల్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ అకాడమీలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహించామని, రాష్ట్రం నలుమూలల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐటా సీఎస్‌-7 పోటీలను నిర్వహిస్తామన్నారు. గ్లోబల్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, టెన్నిస్‌ శిక్షకులు పి.ఆనందకుమార్‌, రవి, సాయి, గిరీశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని