logo

వయ్యారి భామ మొక్కలతో జాగ్రత్త

శరీరంపై దద్దుర్లు, దురదల వంటి ఎలర్జీ లక్షణాలకు గురి చేసే.. వయ్యారి భామ (పార్థినియం) మొక్కలపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు  సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 27 Mar 2023 04:41 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌ : శరీరంపై దద్దుర్లు, దురదల వంటి ఎలర్జీ లక్షణాలకు గురి చేసే.. వయ్యారి భామ (పార్థినియం) మొక్కలపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు  సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఆయన గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సాధారణంగా క్యారెట్‌ గ్రాస్‌, కాంగ్రెస్‌ గ్రాస్‌, గజర్‌ వంటి పేర్లతో పార్థియం మొక్కలను పిలుస్తారని పేర్కొన్నారు. వీటి పువ్వుల నుంచి వెలువడే పొడి పలు ఎలర్జీలకు దారి తీస్తుందన్నారు. సమస్యాత్మకమైన కలుపు మొక్కల జాబితాలో ఇదొకటిగా ఉందని, దీన్ని పూర్తిగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని, పంట నష్టాలను నివారించాలన్నారు.

31న సామూహిక నిర్మూలన కార్యక్రమం : గ్రామ/వార్డు సచివాలయాలు, పంచాయతీలు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద పార్థినియం మొక్కలను ప్రదర్శించడంతో పాటు, వీటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈనెల 31వ తేదీ శుక్రవారం సదరు మొక్కల సామూహిక నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని ఆదేశించారు. ఆ మొక్కలను వేళ్లతో సహా పెకలించి, దహనం చేయాలని పేర్కొన్నారు. వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు వై.వి.ప్రసన్నలక్ష్మి, ఎ.రవీంద్రరావు, డీపీవో జె.సునీత, ఉద్యాన శాఖ అధికారి పి.బాలాజీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని