logo

ఇలా నెట్టుకొస్తున్నారు!

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.

Updated : 28 Mar 2023 06:01 IST

మల్లాయిపాలెంలో టిడ్కో గృహ సముదాయాల ముందు రోడ్డు నిర్మించకపోవడంతో బురదలో ఇరుక్కుపోయిన ట్రాలీ ఆటో

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చాక పూర్తయిన వాటికి పార్టీ రంగులు వేయించారు. గడిచిన మూడున్నరేళ్లలో కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలను నిర్మించలేదు. గుడివాడ మండలం మల్లాయిపాలెంలో 77 ఎకరాల్లో 8912 టిడ్కో గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే గత 4 నెలల్లో మూడుసార్లు గృహప్రవేశాల ముహూర్తాలు ఖరాలు చేసి వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఉగాదికి ప్రారంభిస్తామని హడావుడి చేశారు. ఉగాది కూడా వెళ్లిపోయింది. ప్రారంభం సంగతి దేవుడెరుగు కనీసం గృహాల దగ్గరకు చేరుకునేందుకు రోడ్లు వేయండి మహాప్రభో అని స్థానికులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.టిడ్కో గృహ సముదాయాలను ఆనుకుని జగనన్న కాలనీల నిర్మాణం కోసం 178 ఎకరాల్లో 7007 ఫ్లాట్లను సిద్ధం చేసి ఇప్పటికే 3663 మంది లబ్ధిదారులకు కేటాయించారు. జగనన్న కాలనీల దగ్గరకు వెళ్లాడానికి కూడా టిడ్కో గృహ సముదాయం మార్గమే కావడంతో రోడ్లు సరిగా లేక నిర్మాణాలు ఆగిపోతున్నాయి.గుడివాడ నుంచి బందరు వెళ్లే రహదారిలో బొమ్ములూరి నుంచి కేవలం అరకిలోమీటర మేర రోడ్డు వేస్తే నిర్మాణాల దగ్గరకి సజావుగా వెళ్లవచ్చు.

అందరిదీ ఇదే సమస్య

ఈనాడు అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు