logo

మా గోడు పట్టించుకోండి

ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే  ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు రైతులు డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 04:45 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న రైతులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే  ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట వీరు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకుడు వీరమాచనేని భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ రెండు మండలాల పరిధిలో 25వేల టన్నులకుపైగా ధాన్యాన్ని ఆన్‌లైన్‌ చేయాల్సి ఉందని అన్నారు. ఈ సమస్యను ఇంతకుముందు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఇప్పటివరకు పరిష్కరించలేదని అన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు కూడా ఎన్నాళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని, రైతులు అధికారులను కలవడానికి వస్తున్నా పోలీసులు కలెక్టరేట్‌లోకి అందరినీ అనుమతించడం లేదన్నారు. ఈ సమస్యను మరోసారి జేసీ అపరాజితసింగ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆమె అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. గోపతి నాగేశ్వరరావు, యార్లగడ్డ భాస్కరరావు, మాడెం శ్రీనివాసరావు, మండల గోపాలకృష్ణ, మిక్కిలినేని పశి, బొందలపాటి శివరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని