logo

చల్లపల్లిని సందర్శించిన మహిళా సర్పంచులు

స్వచ్ఛ చల్లపల్లి గ్రామాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్‌లోని మహిళా సర్పంచులు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సోమవారం సందర్శించారు.

Published : 28 Mar 2023 04:45 IST

సంపద తయారీ కేంద్రం వద్ద సర్పంచుల బృందం

చల్లపల్ల్లి, న్యూస్‌టుడే : స్వచ్ఛ చల్లపల్లి గ్రామాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్‌లోని మహిళా సర్పంచులు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సోమవారం సందర్శించారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఎకొలాజికల్‌ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో 13 మంది మహిళా సర్పంచులు, సంస్థ ప్రతినిధులు శ్రీకాకుళంలోని ఆర్థిక సమతా మండలిని, ఆ తర్వాత చల్లపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని స్వచ్చతా కార్యక్రమాలను పరిశీలించారు. ప్రకృతి వనరులను ఎలా రక్షించుకోవాలి, గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయమై పలు అంశాలపై అధ్యయనం చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో ఈ పరిశీలన చేపట్టారు. చల్లపల్లికి ఐకానిక్‌గా ఉన్న మహాత్మాగాంధీ స్మృతివనాన్ని, చల్లపల్లిలోని సంపద తయారీ కేంద్రాన్ని, మన కోసం మనం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను, మినీ గార్డెనింగ్‌ను సందర్శించారు. స్వచ్ఛ చల్లపల్లి సారథులు డాక్టర్‌ డీఆర్‌కే ప్రసాద్‌, డాక్టర్‌ పద్మావతిని కలిసి స్వచ్ఛ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకున్నారు. సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పి.సుకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ చల్లపల్లిలోని స్వచ్ఛతా కార్యక్రమాలు, సందప తయారీ కేంద్రం నిర్వహణ, చెత్త సేకరణ తదితర అంశాల గురించి సర్పంచుల బృందానికి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని