ఫిర్యాదులను తక్షణం పరిష్కరించండి: ఎస్పీ
స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులకు చట్ట పరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ పి.జాషువా అధికారులకు సూచించారు.
బాధితుల సమస్య తెలుసుకుంటున్న జాషువా
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులకు చట్ట పరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ పి.జాషువా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన వారి నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ పరిచయమైన వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ తిరిగి ఇవ్వమంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని గుడివాడకు చెందిన సరిత, చెప్పుడు మాటలు విని భర్త మానసికంగా శారీరకంగా హింసకు గురిచేస్తున్నాడని పమిడిముక్కలకు చెందిన వివాహిత ఫిర్యాదు చే శారు. తన సొంత స్థలంలో నూతనంగా గదిని నిర్మించుకోనీయకుండా కొందరు తనపై భౌతికదాడికి పాల్పడుతున్నారని బంటుమిల్లికి చెందిన సురేష్‌తో పాటు వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ మరికొందరు ఫిర్యాదులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన