logo

ఆధార్‌ తాజాపర్చడం తప్పనిసరి

ఆధార్‌ కార్డు 2016కి ముందు తీసుకున్నవారు అప్పట్లో ఎటువంటి పత్రాలు ఇవ్వలేదని, అలాంటివారు సంబంధిత పత్రాల నకళ్లు, ఫొటో, చిరునామా ప్రూఫ్‌ ఇచ్చి తాజాపర్చుకోవాలని తపాలా శాఖ సహాయ సంచాలకుడు (వ్యాపారాభివృద్ధి, భవనాలు) వీఎస్‌ఎల్‌ నరసింహారావు చెప్పారు.

Published : 28 Mar 2023 04:45 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆధార్‌ కార్డు 2016కి ముందు తీసుకున్నవారు అప్పట్లో ఎటువంటి పత్రాలు ఇవ్వలేదని, అలాంటివారు సంబంధిత పత్రాల నకళ్లు, ఫొటో, చిరునామా ప్రూఫ్‌ ఇచ్చి తాజాపర్చుకోవాలని తపాలా శాఖ సహాయ సంచాలకుడు (వ్యాపారాభివృద్ధి, భవనాలు) వీఎస్‌ఎల్‌ నరసింహారావు చెప్పారు. స్థానిక హెడ్‌ పోస్టాఫీసును ఆయన సోమవారం సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను, వినియోగదారులను గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఆధార్‌ తాజాపర్చడం కోసం జిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ హెడ్‌ పోస్టాఫీసులు, చిలకలపూడి, చింతగుంటపాలెం, పెడన, గుడ్లవల్లేరు, గాంధీక్షేత్రం, కొడాలి, కోడూరు, కూచిపూడిసెంటర్‌, నాగాయలంక, చల్లపల్లి, పామర్రు సబ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ సేవలు పొందొచ్చని చెప్పారు. విదేశాలకు పంపించే పార్శిళ్లను డీఎన్‌కే పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా విదేశాలకు వారి ఉత్పత్తులను సులువుగా, వేగంగా పంపించుకోవచ్చని చెప్పారు. స్థానిక హెడ్‌ పోస్టుమాస్టర్‌ సింహాద్రి రామలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు