logo

‘ఆదివాసీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలి’

బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబా యోగి డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2023 02:16 IST

మాట్లాడుతున్న యోగి. పక్కన జన్ని, కిరణ్‌

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబా యోగి డిమాండ్‌ చేశారు. ఆదివాసీలంతా కలిసి గత ఎన్నికల్లో వైకాపాని గెలిపిస్తే.. ముఖ్యమంత్రి జగన్‌ తమకు ఇచ్చిన బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు. దీన్ని నిరసిస్తూ తక్షణమే ఆదివాసీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన గిరిజనేతర బోయ, వాల్మీకి కులాలు, శ్రీకాకుళం జిల్లాలో నకిలీ బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో కలపడం వల్ల ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ముఖ్యంగా యువత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ రిజర్వేషన్లతో గిలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించకుండా చప్పట్లు కొట్టడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే ఆదివాసీ ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 31న తలపెట్టిన మన్యం బంద్‌కు పార్టీలకతీతంగా ఆదివాసీ రాజకీయ నాయకులు, ఉద్యోగులు, యువత పాల్గొని జయప్రదం చేయాలని యోగి పిలుపునిచ్చారు. సంఘం నాయకులు జన్ని, నీలమ్మ, కిరణ్‌, ప్రకాష్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు