logo

యువకుడి శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం

గోళ్లమూడి గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ బాబూసాహెబ్‌ వైద్యానికి స్నేహితులు బుధవారం రూ.29,750 ఆర్థిక సాయం అందజేశారు.

Published : 30 Mar 2023 02:16 IST

బాధితుడి తండ్రి జాన్‌సైదాకు నగదు అందజేస్తున్న స్నేహితులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: గోళ్లమూడి గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ బాబూసాహెబ్‌ వైద్యానికి స్నేహితులు బుధవారం రూ.29,750 ఆర్థిక సాయం అందజేశారు. ‘పేద యువకుడికి పెద్ద కష్టం!’ శీర్షికన ఈనెల 26న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. రుద్రవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2009-10 సంవత్సరం పదో తరగతి చదివిన గోళ్లమూడి, రుద్రవరం, పల్లగిరి గ్రామాల విద్యార్థులు ఈ మొత్తాన్ని సేకరించి యువకుడి తండ్రి జాన్‌సైదాకు అందజేశారు. ఫోన్‌పే ద్వారా కొందరు దాతలు రూ.10 వేలు, గోళ్లమూడికి చెందిన మేడా వెంకటేశ్వరరావు రూ.5 వేలు, నందిగామకు చెందిన ఓ వ్యక్తి రూ.5 వేలు నగదు, బియ్యం, కూరగాయలు అందజేశారు. దాతలకు యువకుడు కృతజ్ఞతలు తెలిపారు.

బాలుడి వైద్యానికి..

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కోలా సాయి జ్ఞానేశ్వర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం పలువురు దాతలు రూ.3.50 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈనెల 28న ‘ఈనాడు’లో ‘అయ్యో..బుజ్జాయి’ శీర్షికన వచ్చిన వార్తకు దాతలు స్పందించారు. మంగళవారం రూ.2లక్షల సాయం అందించగా బుధవారం బాలుడి తండ్రి సతీష్‌ ఖాతాకు రూ.1.50లక్షలు జమచేశారు. బాలుడికి లివర్‌ మార్పిడి చేసేందుకు రూ.25లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు తండ్రి తెలిపారు. మానవత్వంతో స్పందించి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు