logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.14 కోట్లు

దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో దేవస్థానం సిబ్బంది, సేవా సంస్థల సభ్యులు బుధవారం లెక్కించారు.

Published : 30 Mar 2023 02:09 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో దేవస్థానం సిబ్బంది, సేవా సంస్థల సభ్యులు బుధవారం లెక్కించారు. 16 రోజుల్లో భక్తులు హుండీల్లో వేసిన కానుకలు లెక్కించగా రూ.2.14 కోట్లు వచ్చింది. కానుకలతో పాటు 615 గ్రాముల బంగారం, 3.685కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఇ-హుండీ ద్వారా రూ. 2,62,108 ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, సభ్యులు కట్టా సత్తెయ్య, బుద్ధా రాంబాబు, చింకా శ్రీనివాసరావు, బచ్చు మాధవి కృష్ణ, వేదకుమారి పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని