logo

విద్యుదాఘాతంతో రైతు మృతి

పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని వావిలాలలో చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 02:16 IST

చిరసాని బేకరు (పాతచిత్రం)

వావిలాల (తిరువూరు), న్యూస్‌టుడే: పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని వావిలాలలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రైతు చిరసాని బేకరు(55) మంగళవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లారు. నీరు పెట్టడానికి మోటారు స్విచ్‌ ఆన్‌ చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్తు మోటారు వద్ద నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎన్‌.స్వామిదాసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని