logo

వేదాద్రి ఉత్తిపోతలే..!

వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిగా పడకేసింది. పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 38వేల ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు రైతుల దీర్ఘకాలిక సాగు నీటి సమస్యకు పరిష్కారంగా దీనిని చేపట్టారు.

Updated : 30 Mar 2023 06:34 IST

పిచ్చిమొక్కల మధ్య శిలాఫలకం

వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిగా పడకేసింది. పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 38వేల ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు రైతుల దీర్ఘకాలిక సాగు నీటి సమస్యకు పరిష్కారంగా దీనిని చేపట్టారు. గత ప్రభుత్వం ముక్త్యాల ఎత్తిపోతల పేరుతో తలపెట్టిన బృహత్‌ పథకానికి వైకాపా ప్రభుత్వం పేరుతో పాటు స్థలాన్ని మార్చింది. నిధులు కేటాయించి సాకారం చేయడంలో చిత్తశుద్ధిని చూపలేకపోయింది. వేదాద్రి సమీపంలో కృష్ణా నది నుంచి నీటిని ఎన్‌ఎస్‌పీ కాల్వల్లోకి చేరవేసేందుకు అవసరమైన పైపులైన్ల నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తి కాకుండానే గుత్తేదారు పూర్తిగా పనులు నిలిపివేశారు. కృష్ణా నది పక్కన జరగాల్సిన పంపింగ్‌ హౌస్‌ నిర్మాణం కోసం మొదలుపెట్టిన ఫౌండేషన్‌ పనులు కూడా ప్రాథమిక దశలోనే ఆగిపోయాయి. పైపులైన్ల నిర్మాణం కోసం జగ్గయ్యపేట మండలంలోని ఏడు గ్రామాలు, వత్సవాయి మండలంలోని 3 గ్రామాలతో కలిపి 98 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. 2021 నాటికే పనులు పూర్తవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కకపోవడం గమనార్హం.

చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో వదిలేసిన భారీ పైపులు

పైపులైన్ల కోసం తవ్విన గుంతలో చేరిన నీరు

పనుల కోసం వచ్చిన సిబ్బందికి ఏర్పాటు చేసిన షెడ్లు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, జగ్గయ్యపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని