మహిళా మహోత్సవాలకు విశేష స్పందన
మహిళా మహోత్సవాల సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది.
రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి
రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోద కార్యక్రమాన్ని తిలకిస్తున్న పర్యాటకులు
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే : మహిళా మహోత్సవాల సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఏర్పాటు చేసిన మహిళా మాసోత్సవాల్లో అన్ని వర్గాల మహిళామణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సినీ ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొంటున్నారు. స్టూడియో టూర్, ప్రత్యేక ప్రదర్శనలు, స్టంట్ షోలు, సరదా రైడ్‌లు, పక్షుల పార్కు, సీతాకోక చిలుకల పార్కు సందర్శన, అందమైన గార్డెన్‌లలో విహారంతో అద్వితీయ అనుభూతిని పొందుతున్నారు. ప్రత్యేక వినోద కార్యక్రమాలను వీక్షిస్తూ, రామోజీ అడ్వెంచర్ సాహస్‌లోని సాహస కార్యకలాపాల్లో భాగస్వాములవుతూ ఆనందిస్తున్నారు. అంతేకాదండోయ్ టాలెంట్ హంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తుండటంతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మహోత్సవాల సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ ఆన్‌లైన్ ద్వారా ఒక ప్రవేశ టికెట్‌ను కొనుగోలు చేస్తే ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించడంతో మంచి ఆదరణ లభించింది. 31వ తేదీ వరకు వేడుకల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న