logo

వైకాపా పాలనకు చరమగీతం పాడుదాం: కొల్లు

తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 30 Mar 2023 03:09 IST

తెదేపా ఆవిర్భావ వేడుకల్లో కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో రవీంద్రతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. తొలుత పార్టీ కార్యాలయంలో కేక్‌ కోసిన అనంతరం బస్టాండ్‌ సెంటరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర, తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పునరంకితం కావాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించే చంద్రబాబుకు తిరిగి పట్టం కట్టేందుకు అన్ని వర్గాలు సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. పార్టీ సీనియర్‌ నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్యక్రమంలో పాల్గొన్నారు.

*  రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి తెదేపా పర్యాయపదంగా నిలుస్తుందని మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌ అన్నారు. ఒకటో డివిజన్‌లో మాజీ కౌన్సిలర్‌ బత్తిన దాస్‌ ఆధ్వర్యాన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెదేపా ఆవిర్భవించిందన్నారు. నాయకులు సాతులూరి నాంచారయ్య, జగన్మోహనరావు, శ్రీను, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని