logo

1500 పైగా విద్యార్థుల ఆలోచనలు

జిల్లాలో స్కూల్‌ ఇన్నోవేటివ్‌ ప్రోగ్రాం(ఎస్‌ఐపి) కింద విద్యార్థులు 1500 ఆలోచనలతో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారని జిల్లా సైన్సు అధికారి జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 04:55 IST

రాష్ట్ర ప్రదర్శనకు ఉత్తమ ప్రాజెక్టులు

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో స్కూల్‌ ఇన్నోవేటివ్‌ ప్రోగ్రాం(ఎస్‌ఐపి) కింద విద్యార్థులు 1500 ఆలోచనలతో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారని జిల్లా సైన్సు అధికారి జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ ఆలోచనలు పంచుకోవటానికి అవకాశం ఉందని వివరించారు. విద్యార్థుల ఆలోచనలకు సంబంధించిన నమూనాల్ని తయారు చేయటానికి పరికరాల్ని అందిస్తామని వివరించారు. వీటిలో జిల్లా నుంచి ఒక ఉత్తమ నమూనాను ఎంపిక చేస్తామని తెలిపారు. ఉత్తమ నమూనాలతో రాష్ట్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు