logo

అమరావతిపై ముఖ్యమంత్రి మంకుపట్టు వీడాలి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంకుపట్టు వీడి, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Published : 31 Mar 2023 04:55 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంకుపట్టు వీడి, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరిందన్నారు. ఇది చరిత్రలో కనీవినీ ఎరుగని ఉద్యమమని చెప్పారు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతను తానేనని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి రాగానే మాటమార్చి, మడమ తిప్పి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం లెక్క చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. సుప్రీంకోర్టు కూడా జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉగాది తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తామన్న జగన్‌కు.. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ చుక్కెదురైందన్నారు. అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నిర్వహించే సంఘీభావ కార్యక్రమాల్లో సీపీఐ శ్రేణులు భాగస్వాములు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని