logo

ముగిసిన జేఎన్‌టీయూకే సెంట్రల్‌ జోన్‌ క్రీడా పోటీలు

స్థానిక ఎస్‌ఆర్‌జీఈసీలో రెండు రోజులుగా నిర్వహించిన జేఎన్‌టీయూకే సెంట్రల్‌జోన్‌ క్రీడా పోటీలు ముగిశాయి.

Published : 31 Mar 2023 05:03 IST

బహుమతులు సాధించిన గుడ్లవల్లేరు కళాశాల క్రీడాకారులతో ప్రసాద్‌, కోదండ రామారావు తదితరులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక ఎస్‌ఆర్‌జీఈసీలో రెండు రోజులుగా నిర్వహించిన జేఎన్‌టీయూకే సెంట్రల్‌జోన్‌ క్రీడా పోటీలు ముగిశాయి. యూనివర్శిటి పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని కళాశాలలకు చెందిన 198 జట్లు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీ పడ్డాయి. విజేతల వివరాలను కళాశాల ప్రిన్సిపల్‌, టోర్నమెంట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ గుత్తా ప్రసాద్‌ వెల్లడించారు. పురుషుల విభాగంలో వాలీబాల్‌లో రాజమండ్రి, సూరంపాలెం కళాశాలలు ప్రథమ, ద్వితీయ స్థానాలను, కబడ్డీలో పరిటాల, గుడ్లవల్లేరు జట్లు, టేబుల్‌టెన్నిస్‌లో కాకినాడ, తాడేపల్లిగూడెం, బాల్‌బ్యాడ్మింటన్‌లో గుడ్లవల్లేరు, విజయవాడ, మహిళా విభాగంలో వాలీబాల్‌లో గుడ్లవల్లేరు, గుంటూరు, కబడ్డీలో గుడ్లవల్లేరు, కాకినాడ, టేబుల్‌టెన్నిస్‌లో విశాఖపట్నం, గుడ్లవల్లేరు, బాల్‌బ్యాడ్మింటన్‌లో గుడ్లవల్లేరు, విశాఖపట్నం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు ఆయన వెల్లడించారు. విజేతలకు ట్రోఫీలను ప్రిన్సిపల్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపల్స్‌ డాక్టర్‌ పి.కోదండరామారావు, డాక్టర్‌ ఎంఆర్‌సీహెచ్‌.శాస్త్రి, విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ బి.కరుణకుమార్‌, యాజమాన్య సలహాదారు డాక్టర్‌ పి.రవీంద్రబాబు తదితరులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని