logo

బంగారం రుణాల మంజూరులో యూనియన్‌ బ్యాంక్‌ రికార్డు

స్థానిక యూనియన్‌ బ్యాంకు శాఖ ఒక్క రోజులోనే రూ.2.16 కోట్లకుపైగా బంగారు రుణాలను మంజూరు చేసి అరుదైన రికార్డును సొంతం...

Published : 31 Mar 2023 05:03 IST

విజయ చిహ్నం చూపిస్తున్న సిబ్బంది

పామర్రు, న్యూస్‌టుడే: స్థానిక యూనియన్‌ బ్యాంకు శాఖ ఒక్క రోజులోనే రూ.2.16 కోట్లకుపైగా బంగారు రుణాలను మంజూరు చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకొని పాన్‌ ఇండియా స్థాయిలో 2వ స్థానం సాధించిందని ఆ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ హరిరామ్‌ తెలిపారు. గురువారం స్థానిక శాఖా కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కేక్‌ కోసి సిబ్బందికి పంచిపెట్టి, వారిని అభినందించారు.ఈ సందర్భంగా బ్యాంకు జీఎం నవనీత్‌కుమార్‌, మేనేజర్‌, సిబ్బందిని ప్రత్యేక వీడియోలో అభినందించారు. బ్రాంచి మేనేజర్‌ శేషగిరిరావు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని