logo

వసతి గృహాల అభివృద్ధికి విరాళం

జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ వారు.. ఎన్టీఆర్‌ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.25 లక్షల...

Published : 31 Mar 2023 05:19 IST

కలెక్టర్‌ డిల్లీరావుకు నమూనా చెక్కు అందజేస్తున్న శ్రీధర్‌, సతీష్‌కుమార్‌, రాజేష్‌, జయదేవ్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ వారు.. ఎన్టీఆర్‌ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.25 లక్షల విరాళ చెక్కును విజయవాడలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు గురువారం అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో తాగునీరు, వంట గదులు, ఫర్నిచర్‌, విద్యుత్తు, మరుగుదొడ్ల అభివృద్ధికి, భవనాలకు రంగులు వేయడం తదితరాలకు వినియోగించనున్నట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చెక్కు అందజేసిన వారిలో అల్ట్రాటెక్‌ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీధర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌, సంస్థ ప్రతినిధులు జి.రాజేష్‌, డి.జయదేవ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు