logo

చక్రాల కుర్చీకి... కట్లు కట్టాల్సిందే...

విజయవాడ కొత్త ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే నడవలేని రోగులకు నరకం కనిపిస్తోంది. సరిపడా వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండడం లేదు.

Published : 31 Mar 2023 05:19 IST

రుమాలుతో కట్టుకున్నారు ఇలా...

విజయవాడ కొత్త ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే నడవలేని రోగులకు నరకం కనిపిస్తోంది. సరిపడా వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండడం లేదు. సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి తన తల్లిని తీసుకెళ్లడానికి ఓ వ్యక్తి వీల్‌ఛైర్‌ కోసం ప్రయత్నించగా కాళ్లు పెట్టుకునే ప్రదేశంలో విరిగిపోయి కనిపించింది. దీంతో ఆయన తన దగ్గర ఉన్న రుమాలును తల్లి కాలు పెట్టుకోవడానికి వీలుగా వీల్‌ఛైర్‌కి కట్టి తీసుకెళ్లారు. చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయని రోగులు చెబుతున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని