logo

పది పరీక్షలకు భద్రతా ఏర్పాట్లు: డీఈవో

పది పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు.

Published : 01 Apr 2023 04:46 IST

గంగాధరపురంలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్న ఆర్జేడీ నాగమణి

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పది పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 22,436మంది పరీక్షలకు హాజరవుతారని వారిలో 12,048 మంది బాలురు, 10,388మంది బాలికలు ఉన్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 143 కేంద్రాలు ఎంపిక చేశామని, 143మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 143మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించామన్నారు. పరీక్షల సామగ్రి పంపిణీకి పది రూట్లు గుర్తించి 10మంది రూట్‌ అధికారులు, మరో 10మంది అదనపు రూట్‌ అధికారులకు బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. బంటుమిల్లి మండలంలోని పెదతుమ్మిడి, గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాల్లోకి చరవాణులు తీసుకెళ్లకూడదని, విధులు కేటాయించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేశామని, వారికి తప్ప లోపలికి ఎవరినీ అనుమతించబోమన్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా,  8.30 నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే ఈ ఫోన్‌ నెంబర్లలో (9848232601, 9966753718, 9848530928) సంప్రదించాలని కోరారు.

గుడివాడ(నెహ్రూచౌక్‌),న్యూస్‌టుడే: గుడివాడ పట్టణం, మండలంలోని చౌటపల్లి, గంగాధరపురం, మోటూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ నాగమణి, డీఈవో తాహెరా సుల్తానా శుక్రవారం పరిశీలించారు. పరీక్ష ఏర్పాట్లపై స్థానిక ఎస్పీఎస్‌ పాఠశాలలో ఆమె తనిఖీ చేశారు. గంగాధరపురం ఉన్నత పాఠశాలలో పిల్లల అభ్యాసన, పఠనా సామర్థ్యం తదితర విషయాలను అంచనా వేశారు. ఎంఈవో బీఎస్‌సీ శేఖర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని