logo

ఏప్రిల్‌ 4 నుంచి సదరం సేవలు

 ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో సదరం సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.గంటా వరప్రసాద్‌ తెలిపారు.

Published : 01 Apr 2023 04:46 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే:  ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో సదరం సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.గంటా వరప్రసాద్‌ తెలిపారు. ఆసుపత్రిలో గత రెండునెలలుగా సదరం సేవలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలనుంచి వస్తున్న రోగులు పడుతున ఇబ్బందులపై శుక్రవారం ‘ఈనాడు’లో ‘రమ్మంటారు...వస్తే ఉండరు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమవగా ఆయన స్పందించారు. ఆసుపత్రిలో కొన్ని విభాగాల వైద్యులు లేకపోవడం, ఉన్నవారు కొందరు సెలవు పెట్టడంతో సమస్య ఏర్పడిందని చెప్పారు. కంటివిభాగానికి చెందిన వైద్యుడిని విజయవాడ ఆసుపత్రినుంచి సదరం నిర్వహించే రోజుల్లో మచిలీపట్నం ఆసుపత్రికి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటు వైద్యులకు డిజిటల్‌ టోకెన్స్‌ జారీ ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు. 4వ తేదీ నుంచి ఇకపై నిర్దేశించిన రోజుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తామని, అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోనూ అధునాతన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని