logo

పేదలకు గృహ యోగమేదీ..!?

పామర్రులోని ఇళ్లు లేని పేదలకు నివేశన స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం 2019లో ప్రభుత్వం కొనుగోలుచేసిన భూమి ఇది.

Published : 01 Apr 2023 04:46 IST

లేఔట్‌ వేయక.. మౌలిక సదుపాయాల్లేక..

పామర్రులోని ఇళ్లు లేని పేదలకు నివేశన స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం 2019లో ప్రభుత్వం కొనుగోలుచేసిన భూమి ఇది. సుమారు 2 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 30 ఎకరాల భూమిని అధికారులు కొనుగోలు చేశారు. ఇందులో కొంత భూమికి సంబంధించి న్యాయ సమస్యలుండడంతో లేఔట్‌ పనులు ఆపేశారు. 5 నెలల కిందట సమస్యలన్నీ తొలగిపోయాయి. అధికారులు పేదలకు ఇళ్ల స్థలాలు చూపించినప్పటికీ మౌలిక సదుపాయలు కల్పించడం లేదు. అన్నిచోట్లా గృహనిర్మాణాలు చేపడుతున్నా.. ఇక్కడ మాత్రం పనులు మొదలు కాలేదు. లేఔట్‌ మొత్తం గడ్డి, ముళ్ల పొదలు పెరిగాయి. సరహద్దు రాళ్లు విరిగిపోయి కనిపిస్తున్నాయి.

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని