logo

టోల్‌ పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

టోల్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సత్వరమే కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్‌ చేశారు.

Updated : 01 Apr 2023 06:33 IST

పొట్టిపాడు వద్ద సీపీఎం ఆందోళన

టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు, నాయకులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : టోల్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సత్వరమే కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్‌ చేశారు. గన్నవరం డివిజన్‌ సీపీఎం ఆధ్వర్యంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా రూ.3740 కోట్ల టోల్‌ ఛార్జీలను వసూలు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అదనంగా 10 శాతం వసూలు చేసేలా తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. పెంచిన టోల్‌ ఛార్జీలతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న భాజపా ప్రజల నడ్డి విరిచేలా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరు ఖండించి.. రానున్న సాధారణ ఎన్నికల్లో భాజపాను గద్దె దింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, లక్ష్మణస్వామి, కళ్లం వెంకటేశ్వరరావు, బేతా శ్రీనివాసరావు, అబ్దుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని