logo

రాజీ కుదిర్చేందుకే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రం: ఎస్పీ

చిన్న చిన్న విభేదాలతోనే భార్యాభర్తలు విడిపోతున్నారని, ఇరువురూ కూర్చుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ జాషువా అన్నారు.

Updated : 01 Apr 2023 06:32 IST

నియామక పత్రాలు పొందిన వారితో ఎస్పీ జాషువా తదితరులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: చిన్న చిన్న విభేదాలతోనే భార్యాభర్తలు విడిపోతున్నారని, ఇరువురూ కూర్చుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. మచిలీపట్నంలోని దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడిపోవాలనుకునే దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఈకేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇరుపక్షాల సమస్యలు తెలుసుకుని వారికి సలహాలు ఇచ్చేందుకు 12మందిని అనుభవజ్ఞులు కేంద్రంలో అందుబాటులో ఉంటారని అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 17మంది హోమ్‌గార్డు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు. ఒకేసారి 17మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారు శాంతిభద్రతలు పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. ఏఎస్పీ రామాంజనేయులు, ఏఆర్‌ ఏఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని