logo

ఆధునిక పద్ధతులపై అవగాహన అవసరం

వైద్య విధానంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు  అన్నారు.

Published : 01 Apr 2023 04:46 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాసరాజు, ఐఎంఏ ప్రతినిధులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: వైద్య విధానంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు  అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్న సంఘ రాష్ట్ర రీజనల్‌ కాన్ఫరెన్స్‌ జోన్‌-2 సమావేశాలను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సమావేశాలల్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆధునిక వైద్యవిధానాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్యులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ అబ్జర్వర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, డీఎంహెచ్‌వో గీతాబాయి. ఐఎంఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచార్య, అశ్వనీకుమార్‌ తదితరులు ప్రసంగించారు. సంఘ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు కె.వి శివప్రసాద్‌, కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ ఆదివారం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.రవికృష్ణ, కార్యదర్శి ఫణిధర్‌ తదితరులు పాల్గొంటారని అన్నారు. నగరంలోని వివిధ విభాగాల వైద్యులు అధునాతన పద్ధతుల గురించి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు