logo

నావికా దళంలో ఉపాధి అవకాశాలు

భారత నావికాదళంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని భారత నావికాదళ అధికారి లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ భట్టాచార్య అన్నారు.

Published : 01 Apr 2023 04:46 IST

విద్యార్థులకు పుస్తకాలు అందిస్తున్న నావికా దళాధికారి భట్టాచార్య తదితరులు

కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: భారత నావికాదళంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని భారత నావికాదళ అధికారి లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ భట్టాచార్య అన్నారు. ఆయన పలువురు అధికారులతో కలిసి శుక్రవారం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.  దేశపౌరులను నావికాదళంలో చేరేలా ప్రోత్సహించేందుకు విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు ఇలా కోస్తాతీర ప్రాంతాల్లో దాదాపు 7,500 కిలోమీటర్లు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.దీనిలో భాగంగానే విశ్వవిద్యాలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.  అగ్నివీర్‌ ఎంపిక ప్రక్రియ, నావికాదళంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, వాటికి కావాల్సిన విద్యార్హతలు తదితర అంశాలను వివరించడంతోపాటు విద్యార్థులకు అన్ని వివరాలతో రూపొందించిన పుస్తకాలను పంపిణీ చేశారు. విశ్వవిద్యాలయ ఎన్‌సీసీ అధికారి డి.రామశేఖరరెడ్డి, విద్యార్థులు పాల్గొని నావికాదళ అధికారులకు స్వాగతం పలికారు. అధికారులు తొలుత ఉపకులపతి రామమోహనరావును కలిసి మెమొంటో అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని