logo

మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జి. గీతాబాయి అన్నారు.

Published : 01 Apr 2023 04:46 IST

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జి. గీతాబాయి అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యసిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా  గ్రామాలను సందర్శించి రోగులకు సేవలు అందించడంతోపాటు ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పిల్లలకు వైద్యపరీక్షలు చేయాలన్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు, ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం తదితరాలపై ఆరా తీశారు. అవనిగడ్డ మండలం వేకనూరులో జరిగిన మాతృమరణంపై ఆ ప్రాంత వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. జిల్లా  ఇమ్యునైజేషన్‌ అధికారి డా.శర్మిష్ట, వివిధ విభాగాల అధికారులు కె.రత్నగిరి, సుదర్శన్‌బాబు, రామారావు, దీవెనమ్మ, సాంబిరెడ్డి, బి.రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు