Andhra News: ఏప్రిల్‌ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 3 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated : 01 Apr 2023 13:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 3 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 - మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్‌ వెనక్కి తీసుకున్నామని.. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని బొత్స అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని