Vijayawada youth: విన్యాసమే.. విషాదమైతే!
విజయవాడ నగరం, శివార్లలోని పలు ప్రాంతాల్లో యువత ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలతో హడలెత్తిస్తున్నారు. బైక్‌లపై నిలబడి.. కాలు పైకి లేపి..
నగర రోడ్లపై యువత హల్‌చల్
పోలీసుల నిఘా కరవు
ఈనాడు, అమరావతి : విజయవాడ నగరం, శివార్లలోని పలు ప్రాంతాల్లో యువత ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలతో హడలెత్తిస్తున్నారు. బైక్‌లపై నిలబడి.. కాలు పైకి లేపి.. రెండు చేతులూ వదిలేసి.. రోడ్లపై ఫీట్లు చేస్తున్నారు.
విశాలంగా, జనసంచారం తక్కువగా ఉన్న రహదారులను వీటి కోసం ఎంచుకుంటున్నారు. వీటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లోని తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న ఓ యువతిని ఇటీవలే ట్రాఫిక్ పోలీసులు పిలిచి జరిమానా విధించి హెచ్చరించి పంపారు. ఈ తరహా ఫీట్లలో ఎక్కువ శాతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. పోలీసులు మరింత సమర్థంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయి.
కష్టాల్లోకి నెడుతున్న ట్రెండింగ్: యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, తదితర వాటి ద్వారా తమ నిత్య జీవితానికి సంబంధించి పలు అంశాలను చిత్రాలు, దృశ్యాల రూపంలో ఇతరులతో పంచుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా విన్యాసాలు చేయడాన్ని యువత సరదాగా తీసుకుంటోంది. వీటిని కూడా రీల్స్, షార్ట్స్ రూపంలో సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. సర్వ హంగులతో పోస్టు చేసే ఈ వీడియోలకు వచ్చే లైక్‌లు, పాజిటివ్ పోస్టులు చూసి ఆనందిస్తున్నారు.
నెటిజన్లు స్పందించే వరకు పట్టించుకోని పోలీసులు
రద్దీ లేని సమయాలలో బీఆర్‌టీఎస్ రోడ్డు, కనకదుర్గ వంతెన, హైటెన్షన్ రోడ్డు, బెంజి వంతెన, బ్యారేజి, తదితర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై కంకిపాడు, ఉయ్యూరు, తదితర చోట్లా ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవి నిత్యం జరుగుతున్నా సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వెలుగు చూసిన సందర్భాల్లోనే పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఎవరైనా నెటిజన్ పోలీసుల సామాజిక మాధ్యమ ఖాతాకు ఆ వీడియోను ట్యాగ్ చేస్తేనో రంగంలోకి దిగుతున్నారు. పకడ్బందీ నిఘాతోనే ఇటువంటి వాటిని అరికట్టవచ్చు. సీసీ కెమెరాలను పోలీసులు మరింత సమర్థంగా వినియోగించుకుంటే వీటిని నివారించవచ్చు.
వద్దన్నా.. పెడచెవిన పెడుతున్నారు
* విజయవాడకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థినికి బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడమంటే మహా సరదా. తన సోదరుడి బుల్లెట్ బండి తీసుకుని కనకదుర్గ వంతెనపై చేతులు వదిలేసి నడుపుతూ వీడియో చేసింది. దీనిని ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. ఇలా పలుసార్లు తన స్నేహితుల వాహనాలు తీసుకుని ఫీట్లు చేసి వీడియోలు పోస్టు చేస్తుండేది. దీనిపై ఓ వ్యక్తి వీడియోలను విజయవాడ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు. పోలీసులు స్పందించి.. ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ వాహనాలపై జరిమానాలు విధించారు. గత వారం మళ్లీ ఈ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. దీనిపై ట్విట్టర్‌లో పోలీసులకు ఫిర్యాదు రావడంతో నగర 1 ట్రాఫిక్ పోలీసులు పిలిచి జరిమానా విధించి హెచ్చరించారు. ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు యువతి పోలీస్‌స్టేషన్ గడప తొక్కింది.
* ఉయ్యూరుకు చెందిన గౌరీ సాయికృష్ణ బైక్‌పై స్టంట్లు చేస్తూ ఏడు నెలల క్రితం చనిపోయాడు. తల్లిదండ్రులు వారించినా వినకుండా మంటాడ సర్వీసు రోడ్డులో వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలబడి విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురై గాయపడ్డాడు. రెండు వారాలు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
జీవితం విలువైనది
ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర ఫీట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం ఈ విన్యాసాలు చేయొద్దు. ఇటువంటివి చట్టరీత్యా నేరం. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలి. మైనర్లు అయితే తల్లిదండ్రులను కూడా పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించాలి. ఈ విన్యాసాల వల్ల తలెత్తే పరిణామాల గురించి అప్రమత్తం కావాలి. జీవితం ఎంతో విలువైనదని గుర్తించాలి.
వాసు, రోడ్డు భద్రతా నిపుణుడు, ‘వీడు’ స్వచ్ఛంద సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి!
-
ODI WC 2023: బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్.. వరల్డ్ కప్ నుంచి నోకియా ఔట్!
-
Padma Hilsa : బెంగాలీలకు శుభవార్త.. మళ్లీ దేశానికి ‘పద్మా పులస’
-
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్ నాయుడు
-
Congress: దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ.. పరిశీలనలో 300 పేర్లు!
-
Trisha Krishnan: చర్చనీయాంశంగా త్రిష పోస్ట్.. పెళ్లి వార్తల గురించేనా..?