యువత అన్ని రంగాల్లో రాణించాలి
యువత కేవలం ఉపాధి కోసమే కాకుండా అన్ని రంగాల్లో సత్తా చాటాలని డీఐజీ సునీల్‌కుమార్ సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగిన
ముగిసిన రాష్ట్ర టీ 20 ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్
అతిథుల నుంచి విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న సీపీ లెవెన్స్ జట్టు
గుడివాడ(నెహ్రూచౌక్), న్యూస్‌టుడే: యువత కేవలం ఉపాధి కోసమే కాకుండా అన్ని రంగాల్లో సత్తా చాటాలని డీఐజీ సునీల్‌కుమార్ సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగిన రాష్ట్ర టీ 20 ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. బాజీ లెవెన్స్, సీపీ లెవెన్స్ జట్లు ఫైనల్స్‌లో తలపడగా బాజీ లెవెన్స్ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులు చేయగా, సీపీ లెవెన్స్ జట్టు 16 ఓవర్లలోనే 118 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ టైటిల్‌ను అనంత్ కార్తికేయకు, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ బండారు అయ్యప్ప కైవసం చేసుకున్నారు. విజేత జట్లకు డీఐజీ సునీల్‌కుమార్, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, ఎస్పీ జాషూవా చేతుల మీదుగా ట్రోఫీ, నగదు బహుమతులు అందజేశారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, డీఎస్పీ శ్రీకాంత్, టోర్నమెంట్ కన్వీనర్ బాజీఖాన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!