మట్టి.. గట్టిగా పట్టుపట్టి..!
బాపులపాడు మండలంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు మెరక చేసుకునే పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది కొందరు, ఎలాంటి అనుమతుల్లేకుండానే
వేలేరు ఎర్ర చెరువులో తవ్వకాలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బాపులపాడు మండలంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు మెరక చేసుకునే పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది కొందరు, ఎలాంటి అనుమతుల్లేకుండానే మరి కొందరు చెరువుల్ని కొల్లగొట్టేస్తున్నారు. వీరవల్లి, వేలేరు, అంపాపురం, రేమల్లె, కోడూరుపాడు, బొమ్ములూరు, తదితర గ్రామాల్లో యథేచ్చగా మట్టి తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి, వీటికి అండగా నిలబడుతున్నారు. పనిలో పనిగా దండిగా డబ్బులు దండుకుంటున్నారు. వేలేరులో ఆర్.ఎస్ నంబరు 82/2, 83లలో 40.54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర చెరువులో ఓ వైపు అధికార పార్టీ నాయకులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు వేర్వేరుగా యంత్రాలు పెట్టుకుని టిప్పర్లు, ట్రాక్టర్లలో నిర్విరామంగా మట్టిని తరలించేస్తున్నారు. సమీపంలో ఉన్న ఏలూరు జిల్లా ఏపూరు చెరువులో కోర్టు కేసుల నేపథ్యంలో తవ్వకాలు నిలిచిపోవడంతో అక్కడి అవసరాలకు ఎర్ర చెరువు నుంచి మట్టిని తరలింపజేస్తున్నట్లు సమాచారం. నీటి పారుదల, రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగం అంతగా పట్టించుకోకపోవడంతో నిర్విరామంగా ఈ తవ్వకాలు సాగుతున్నాయి.
వీరవల్లి పెద్ద చెరువు నుంచి తరలుతున్న మట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి