సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం
బదిలీ జీవోలో ఉన్న అసంబద్ధ అంశాలు తొలగించి, సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు.
నిరసనలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నాయకులు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: బదిలీ జీవోలో ఉన్న అసంబద్ధ అంశాలు తొలగించి, సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని డీ…ఈవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంబీ రాజేంద్రప్రసాద్ , జిల్లా ఛైర్మన్ బి.లంకేష్ మాట్లాడుతూ సంఘాల సమావేశంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని లేదంటే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచం్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ సయ్యద్‌ఖాసీం మాట్లాడుతూ అన్ని క్యాడర్‌లలో పదోన్నతులు మాన్యువల్‌గా మాత్రమే నిర్వహించాలని, అన్ని ఖాళీలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కేఏ ఉమామహేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు ఎన్‌వీ ప్రసాద్, నాగసోమేశ్వరమ్మ, తమ్ము నాగరాజు, జె.లెనిన్‌బాబు, మండవ శ్రీనివాస్, ఈవీ రామారావు, శేషగరి, నూకలయ్య, ఎన్.రామబ్రహ్మం, ఝాన్సీ, ఆస్లాం తదితరులు ప్రసంగించి ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi Liquor scam: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?