Road Accident: బాబాయికి భోజనం ఇచ్చి వస్తూ..
కరకట్టపై రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన రొయ్యూరు గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
కరకట్టపై ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడి మృతి
వంశీ (పాత చిత్రం)
తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : కరకట్టపై రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన నడ్డి వంశీ(18) పెనమలూరు మండలం చోడవరం గ్రామంలోని ఇసుక రీచ్‌లో పని చేస్తున్న బాబాయి (వెంకన్న)కు ఆదివారం మధ్యాహ్నం భోజనం క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాడు. క్యారేజ్ ఇచ్చిన అనంతరం తిరుగు ప్రయాణంలో కరకట్టపై నుంచి వెళ్తుండగా రొయ్యూరు గ్రామ సమీపంలోని కాలిబాట వంతెన దగ్గరకు రాగానే అవనిగడ్డ వైపు నుంచి బైక్‌పై వస్తున్న కె.ప్రతాప్ ఢీ కొట్టాడు. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో వంశీ(18) కింద పడగా తలకు తీవ్ర గాయమైంది. కె.ప్రతాప్‌కు కాలికి ఫ్యాక్చర్ అయింది. వెంటనే 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వంశీ(18) మృతి చెందాడు. తండ్రి నడ్డి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్ తెలిపారు. వంశీ వ్యవసాయ పనులు చేస్తుంటాడని తెలిపారు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వంశీ మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రి శవాగారంలో భద్రపర్చారు. క్షతగాత్రుడు కె.ప్రతాప్ వివరాలు చెప్పలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్